చెప్పుడు మాటలు;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
 బాల పంచపదులు
===============
1. మందర చెప్పుడు మాటలు!
    కైకేయి తప్పుడు బాటలు!
    విప్పింది వరాల మూటలు!
   మారాయి పట్టం  మాటలు!
   చెప్పుడు మాటలు,
     తప్పుడు బాటలు, రామా!
2.శూర్పణఖ మాటలు,
                       విన్నవాడు! 
   బుద్ధి మరిచిన వాడు,
                       రావణుడు!
  మానినిని మాయతో,
                    హరించాడు!
  కుల క్షయం,
                 కారకుడయ్యాడు!
  చెప్పుడు మాటలు,
    తప్పుడు బాటలు ,రామా!
3. శకుని మాటలు విన్నాడు!
    దుర్బుద్ధి   పెంచుకున్నాడు!
  పరదార అవమానం చేసాడు!
  కడుఘోరంగా మరణించాడు!
చెప్పుడు మాటలు,
  తప్పుడు బాటలు,రామా!
4. ఎవరి మాటలైనా వినాలి!
    కల్ల నిజము తెలియాలి!
    నిజము అనుసరించాలి!
    నీతిపరుడై మెలగాలి!
   చెప్పుడు మాటలు ,
    తప్పుడు బాటలు, రామా!
5. సత్యభాషణం మరవకు!
   తప్పుడు మాటలు అనకు!
   పరులకు చేరవేయకు!
   పాపాలు మూట కట్టకు!
   చెప్పుడు మాటలు,
    తప్పుడు బాటలు , రామా!
6. చాడీలు విని ,
               నేరాలు చేస్తారు!
   విచారణలో ,
                   నిర్ణయిస్తారు!
   నేరస్తులను,
                      గుర్తిస్తారు!
   చాడీలకూ,
                బేడీలు వేస్తారు!
   చెప్పుడు మాటలు,
     తప్పుడు బాటలు,రామా!
7. మంచి మాటలు అనాలి!
     మంచి మాటలు వినాలి!
     మంచి పనులు చేయాలి!
    పసిడి బతుకు బతకాలి!
    చెప్పుడు మాటలు ,
    తప్పుడు బాటలు, రామా!
_________


కామెంట్‌లు