ఐక్యతే ఐశ్వర్యం;- డా. పి వి. ఎల్. సుబ్బారావు. 9441058797.
బాల పంచపది
=============
1. చేతివేళ్ళు కలిస్తే పిడికిలి!
     పిడికిలి శక్తికి ఓ కడలి!
    కడలిలా ముందుకి కదిలి!
   ఆశయం తప్పక సాధించాలి!
  మన ఐకమత్యం ,
                 మన బలం రామా,!

2. కలసి ఉంటే కలదు సుఖం!
     నిన్ను చేరదు  ఏ దుఃఖం!
     ఐకమత్యం మన విజయం!
  అనైక్యతే అసలు పరాజయం!
   మన ఐకమత్యం ,
                 మన బలం, రామా!

3. అంకెల్లా ఒకటవ్వాలి!
    సంఖ్యలై నిలబడాలి!
    ప్రక్రియలు ఉపయోగించాలి!
    సమస్యలన్నీ సాధించాలి!
   మన ఐకమత్యం,
            మన బలం, రామా!

4. చలిచీమలు ఒకటయ్యాయి!
    సర్పాన్నే హతం చేసాయి!
  గడ్డిపరకలు ఏకమయ్యాయి!
    ఏనుగునే బంధించాయి!
     మన ఐకమత్యం,
                 మన బలం, రామా!

5. వేటగాడు నూకలు జల్లాడు!
    పక్షుల కోసం వల వేసాడు!
    వాలడం ఆశగా చూసాడు!
 వలతోఎగరగా కంగుతిన్నాడు!
  మన ఐకమత్యం ,
             మన బలం రామా!

6. అక్షరాలు పదాలయ్యాయి!
    పదాలు వాక్యాలయ్యాయి! 
   వాక్యాలు పుస్తకాలయ్యాయి!
   పుస్తకాలే ఒకటి చేస్తాయి!
   మన ఐకమత్యం,
            మన బలం, రామా!

7. పూలు దారం కలిస్తే హారం!
    హారం శివుడుకేస్తే అందం!
    పూలు దగ్గర అయితే గుచ్ఛం!
    గుచ్ఛం చేతికిస్తే అది బంధం!
   మన ఐకమత్యం,
           మన బలం రామా!
_________


కామెంట్‌లు