తేనెలూరాలి!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు,- 9441058797.
బాల పంచపది
===========
1. ప్రకృతిలో సహజ సిద్ధము!
    సర్వజన సుప్రసిద్ధము!
    ఎవరికి కాదు నిషేధము!
    ఆయుర్వేదాన ఔషధము!
   మనిషి మాట,
                తేనెలూరాలి,రామా!

2.పూలలోనిండుగా ఉంటుంది!
   తేనెటీగ ఒడిసి పడుతుంది!
 చెట్టుకు తేనెపట్టు అవుతుంది!
  పట్టుపడితే దొరుకుతుంది!
 మనిషి మాట, 
           తేనెలూరాలి ,రామా!

3. తీపిధనానికి మొదటిది!
    ఆహారంగా ఎన్నదగినది!
   శిశువుకూ ఇవ్వదగినది!
   అనుపానంగా తగినది!
   మనిషి మాట ,
            తేనెలురాలి, రామా!

4.మనిషి మనసు తేనె కావాలి!
   మనిషి మాట తేనె కావాలి!
  మనిషి స్నేహం  తేనె కావాలి!
  బతుకు తేనెగా చేసుకోవాలి!
 మనిషి మాట,
        తేనెలూరాలి ,రామా!

5. తేనెలూరు ప్రసంగాలు!
     తేనెవాగు కవనాలు!
    తేనె కన్నా తీయనిపద్యాలు!
   తెలుగుభాషలోనే సాధ్యాలు!
   మనిషి మాట ,
          తేనెలూరాలి, రామా!
________


కామెంట్‌లు