జీవనసుధలు;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
 బాల పంచపది
--------------------
1. బాల్యాన కథలు వినాలి!  
   కథలతో బతుకు తెలియాలి!
  నీతితో బతుకు నిలవాలి!
  నీతి బతుకు రీతి కావాలి!
  కథలు విను ,
    జీవితం కదులు ,రామా!
2. పెద్దలమాట ,
                చద్దన్నం మూట!
  అమ్మమ్మ కథ,
                   బతుకు బాట!
  ఆ కథలో ,
                 నీతికి పెద్ద పీట!
 ఆ నీతే బతుక్కి,
                       కట్టిన కోట!
 కథలు విను,
      జీవితం కదులు రామా!
3. పెద్దలున్న ఇల్లు హరివిల్లు!
    వారు చెప్పే కథలు విరిజల్లు!
   భావిలో జ్ఞాపకాల ఆనవాళ్లు!
   జీవన గమనాన మైలురాళ్లు!
  కథలు విను,
       జీవితం కదులు, రామా!
4. కథ వింటే కుదురుస్తుంది!
    కథ చెప్పడం తెలుస్తుంది! 
 అమ్మమ్మకథ హత్తుకుంటుంది!
  జీవితాంతం గుర్తుంటుంది!
   కథలు విను,
      జీవితం కదులు ,రామా!
.
5 ఓనాడు అమ్మమ్మ పోతుంది!
   ఆమెకథ మాత్రం ఉంటుంది!
ఆకథ బతుకుమార్పు,తెస్తుంది!
లోకజ్ఞానం తలుపు తెరుస్తుంది!
కథలు విను ,
     జీవితం కదులు, రామా!
6. నేడు పెద్దలకు,
                 వృద్ధాశ్రమాలు!
   పిల్లలకు ,
             కాన్వెంట్ చదువులు!
  ఎవరికి వారే ,
                  ఉన్న బతుకులు!
  కుటుంబాన,
                 అన్నీ అతుకులు!
   కథలు విను ,
      జీవితం కదులు, రామా!
_________


కామెంట్‌లు