అమ్మ (బాల గేయం);-రావిపల్లి వాసుదేవరావుపార్వతీపురం9441713136
అమ్మ కనులు చల్లన
అమ్మ మనసు లాలన
అమ్మ చూపు దీవెన
అమ్మ రూపు కమ్మన

అమ్మ మాట మధురము
అమ్మ బాట విజయము
అమ్మ తలపు స్నేహము
అమ్మ ఎడద అందము

అమ్మ గుణము స్వచ్ఛము
అమ్మ నడత తేజము
అమ్మ ఒడే వెచ్చన
అమ్మ చెలిమి తీయన

అమ్మ కోరు సత్యము
అమ్మ తీరు సరళము
అమ్మే మన భాగ్యము
అమ్మే మన దైవము

కామెంట్‌లు