పంచపది
=======
మొదటి పంచపది
______
కవితాకాశాన ఓ "స్విస్ బర్న్",
అస్తమించని రవి!
నిజ కవిత్వ బహుముఖ,
ప్రకాశ కోహినూర్ పవి!
భావశ్రీ, భాష శ్రీ,వెరసి ,
రెండుశ్రీల ఏకైక కవి!
అతని కవిత్వ కేంద్రం ,
శ్రమైక సౌందర్య జీవి!
కవిత్వం ఉన్నంత కాలం సర్వజన హృదయ చిరంజీవి,
పివిఎల్.!
రెండవ పంచపది
_____
కవిత్వాన ,
రత్నసింహాసన స్థానమే,
"మహాప్రస్థానం!"
విప్లవం అభ్యుదయ కవిత్వ,
నిజ సంగమస్థానము!
కవితలన్నీ ఆయన చదవడం,
మన సుకృతము!
"కవితా! ఓ కవితా! ",
కవితాత్మకి ఓ సుదర్శనము!
కవిత్వం అనుభవించి, పలవరించేది ,మహాప్రస్థానమే,
పివిఎల్!
________
కవిత్వ నయాగరా! ఎగరేసిన బావుటా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు, 9451059797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి