సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు;-తోట సులోచన- ఆస్ట్రేలియా --చరవాణి 9490173053
1.  అలతి  పదాల సోయగం
      చూడ ముచ్చటైన మకుటం
     సునీతమ్మ  హృదయ వికాసం
     చూడచక్కని  తెలుగు సున్నితంబు

2.  తెలుగు పదాల తియ్యదనం
      కవులకు  ఆనందాల ఉత్సాహం
      జాతీయస్థాయిలో  మెరిసిన  సంబరం
       చూడచక్కని తెలుగు సున్నితంబు

3. భాను తేజంబై  వెలిగే సున్నితం
     పురస్కారాలతో  పొంగే  కవిహృదయం
     సునీతమ్మ  కృషికి  నీరాజనం
     చూడచక్కని  తెలుగు సున్నితంబు

4.    సుధీతిలక   లాంటి  బిరుదులెన్నో
      అంబరాన్ని అంటిన  సంబరాలెన్నో
      సునీతమ్మకు  అవార్డుల  కీరిటాలెన్నో
      చూడచక్కని  తెలుగు సున్నితంబు

5.   సరళ   శతకమై  వెలిగే
       సమీక్షల  ప్రశంసలు విరిసే
       సున్నితమను పేరుతో  విరాజిల్లే
       చూడచక్కని  తెలుగు సున్నితంబు

కామెంట్‌లు