సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ;-పోతుల ఉమాదేవి-*చరవాణి:9491532760
నాల్గుపాదాల నడిచేటి ప్రక్రియ 
పన్నెండు పదాలతో పసందుగుండు
మకుటంతో విలసిల్లును సున్నితం
చూడచక్కని తెలుగు సున్నితంబు


పండితుల పామరుల అలరించే 
పిల్లల్ని పెద్దల్ని ఆకర్షించే
సాహిత్య సౌగంథికమే సున్నితం 
చూడచక్కని తెలుగు సున్నితంబు


అలతియలతి పదాల పాదాలు
అంశమేమిచ్చినా అల్లుకొనే భావాలు
సరళశతకమై విరాజిల్లు వాజ్మయాన
చూడచక్కని తెలుగు సున్నితంబు


సునీతమ్మ మానసాన రూపుదిద్దుకున్నది
సున్నితమను పేరుతోటి వర్ధిల్లుతున్నది
తెలుగుతల్లి కంఠసీమకు అలంకారమైంది
చూడచక్కని తెలుగు సున్నితంబు


నూరుదాటి అంశాలను పేర్చుకున్నది 
రెండు వసంతాలను పూర్తిచేసుకున్నది
ద్వితీయ వార్షికోత్సవానికి ముస్తాబైంది 
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు