స్వతంత్ర భారతం; ఆరెకటికె.నాగేశ్వరరావు చరవాణి:9492612699
ప్రక్రియ :"సున్నితం"
-------------------------------
స్వతంత్ర భారతదేశం మనది
 పాడిపంటల్లో హరితం దేశము
 "స్వేచ్ఛ" అమరవీరుల త్యాగఫలము
 చూడచక్కని తెలుగు సున్నితంబు

 తొలగె భారతదాస్య శృంకలాలు
 మనకువచ్చె స్వేచ్ఛ స్వాతంత్రంబు
 అభివృద్ధి పథాన మనదేశంబు
 చూడచక్కని తెలుగు సున్నితంబు

 యువరక్తంతో నిండిన భారతంబు
 అక్షరాస్యత అందలం ఎక్కించె
 ఎదుగుతున్న మన రైతుభారతం
 చూడచక్కని తెలుగు సున్నితంబు

 వివిధ జాతిమతాల ఉపఖండము
 ఎగిరే మువ్వన్నెల కీర్తిపతాక
 పరిశ్రమలతోడ ప్రగతి పథంబు
 చూడచక్కని తెలుగు సున్నితంబు

 శాంతిలో హిమశిఖరం దేశము
 విశ్వంలో ఆదర్శ ప్రజాస్వామ్యము
 వజ్రోత్సవ భారతికి వందనంబు
 చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు