నేను తిరువణ్ణామలై వెళ్లి కృష్ణ బిక్షు గారిని కలిసి రమణ మహర్షి గారి జీవిత చరిత్ర తెలుసుకొని, మహర్షిని మొదట ఆహ్వానించి భోజనం పెట్టి, తపస్సుకు ప్రోత్సహించిన మిస్సెస్ తల్యార్ ఖాన్ గారిని కలిసి అనారోగ్యంతో మంచంలోనే ఉన్న చలం గారితో కాసేపు కాలక్షేపం చేసి వెదురుపాక వెళ్లి గాడ్ గారి ఆశీస్సులు తీసుకొని పార్వతీపురంలో కృష్ణ యాజి గారిని కలిసి సూర్యపీఠ విశేషాలను తెలుసుకొని విశాఖపట్నం తిరిగివచ్చాను. సత్యవాడ సోదరీమణులు తమ నెలవారీ కార్యక్రమంలో నన్ను మాట్లాడవలసిందిగా కోరారు ప్రసంగం చేస్తూ అరిషడ్ వర్గాన్ని ఎలా జయించాలి. కుండలిని ఎలా స్వాధీనపరచు కోవాలి అన్న విషయాన్ని వివరించాను. ప్రేక్షకులలో ఉన్న భైరవయ్య గారు తెల్లవారి మా కేంద్రానికి వచ్చి మీకు ఏమైనా అనుభవం ఉన్నదా అని అడిగారు. ఇది పుస్తక జ్ఞానం తప్ప వ్యక్తిగతంగా నాకు తెలీదు అని చెప్పాను.
అంతే అంతవరకు మా కేంద్రానికి ప్రతిరోజూ వచ్చే భైరవయ్య గారు రావడం మానివేశారు. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లి వారి శ్రీమతితో మాట్లాడితే వారు సమాధి స్థితిలో ఉన్నారు అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. కొన్ని రోజుల తర్వాత పీఠం పెట్టి ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారు అప్పుడు వేమన మహాశయుడు జ్ఞాపకం వచ్చాడు. "తలపును తలపమి తను తలపమితో ఉండెనేని తత్త్వము నేను" ఎంత చక్కటి వాక్యం. తలపులను వదిలివేసి దాని మీదే దృష్టి కేంద్రీకరించి ఉంటే నేను అన్న తత్వం తెలియక ఏమవుతుంది? నిగ్రహంతో నిద్రాహారాలు మాని కేంద్రీకరించడం ఎంతమందికి సాధ్యమవుతుంది? అలా సాధ్యం చేసుకున్న వాళ్ళు ముక్తిని పొందుతారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నిద్రమత్తులో ఉంటే తత్వ జ్ఞానం ఎలా వంట పడుతుంది అన్నది వేమన గారి ప్రశ్న.
"అంతరంగ మెఱుగ హరుడవును గురుడవును అంతరంగ మెఱుగ నార్యుడగును
అంతరంగ మెఱుగ నతడెపో శివయోగి..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి