కోతి చేష్టలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 శ్రీ రామచంద్రమూర్తి రావణాసురుని తో యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత  వానర సైన్యం మొత్తం రామునికి సహాయం చేస్తామని ముందుకు వచ్చింది.  పెద్ద మనసుతో ఆయన ఒప్పుకున్నారు. కోతిగుణం ఏమిటి మనిషి భుజాలపైకి ఎక్కి చక్కిలిగింతలు పెడుతుంది  మనిషికి చికాకు తెప్పిస్తుంది  అలాంటి దానిని తీసుకువచ్చి  దానికి కొత్త బట్టలు పెట్టి  సింహాసనం మీద కూర్చోబెట్టి  కొండముచ్చులన్నీ చేరి ఆ కోతిని పొగుడుతూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉంటుంది  రాజు స్థితి ఏమిటి? పాలకుల ధర్మం కలిగిన వాడై ఉండాలి. శత్రువులను తుదముట్టించడానికి సామర్ధ్యం ఉండాలి అంతే తప్ప ఏమాత్రం  ఆ పదవికి అర్హత లేని దానిని కూర్చోబెట్టి భజన చేస్తూ ఉంటే  ఎన్నెన్నో అనుమానాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి.  నిజ జీవితంలో మనం చూస్తున్న రాజకీయాలు కూడా మనకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి దానిని వేమన   అందమైన ఆటవెలదిలో మనకు అందించాడు. నిజానికి కోతి కన్నా కొండముచ్చు బలం  ఎక్కువ. చూడడానికి కూడా అది చాలా అందంగా ఉంటుంది. దాని మొహం కారునలుపుగా ఉన్నా చూడడానికి అందంగానే ఉంటుంది. కోతి మొహం పూర్తిగా కనిపించదు ముడుచుకుపోతుంది.  కొండముచ్చు మనిషిగా కనిపిస్తోంది  మన పెద్దలు చాలా కథలు చెబుతూ ఉంటారు. మన పూర్వీకులు అరణ్యవాసం చేసిన రోజులలో  ఆకులు అలములు తింటూ  కందమూలాలు వెతుకుతూ కాలక్షేపం చేసేవారు అనేది.
కొండముచ్చు కూడా  అడవులలో నివాసం అక్కడే ఆహార సముపార్జన చేసి సుఖమయ జీవితాన్ని గడుపుతోంది. కొండముచ్చు లో నుంచి మానవుడు ఉద్భవించాడు అని వారి పెద్దలు చెప్పినట్లుగా మన పెద్దలు చెబుతారు. ఇది నిజమా కాదా అన్నది  అప్రస్తుతం. నీతి లేని వారిని  ఎవరు కొలుస్తారు  వారి వల్ల అవసరం ఉన్న వాళ్ళు  నిర్భాగ్యులు తప్ప ఎవ్వరూ కొలవరు. నీతి లేనివాడు వీళ్ళకు సహకరిస్తాడని, సాయం చేస్తాడని అనుకోవడం భ్రమ కాక మరేమిటి? ఒక నాయకుని ఎన్నుకోవాలి అనుకుంటే అతనిలో సుగుణాలను చూడాలి, సామర్థ్యాన్ని చూడాలి దక్షత ఉన్నదా లేదా అని ఆలోచించాలి మరి ఈ కారణాలను పరిగణనలోనికి తీసుకోకుండా వుంటే సమాజం బాగు పడుతుందా దేశం సుభిక్షంగా ఉంటుందా పరిపాలించేవాడు  నిజాయితీగా ఉండాలి,  స్వార్థాన్ని వదలాలి మంచి మనసుతో ఉన్న ఎవరైనా పరిపాలనా పరులే అని వేమన చెప్పదలుచుకున్న నీతి. అక్కడ రాములవారు కోతిని అంగీకరించడానికి కారణం బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి చంపడానికి సిద్ధమైన అరి వర్గాన్ని చీకాకు పరిచి వారి గురి తప్పించడం కోసం అని పెద్దల ఉవాచ.ఆ పద్యాన్ని మీరు కూడా ఒకసారి కలవాలి.
"కోతి బట్టి దెచ్చి కొత్తపుట్టముగట్టి  కొండముచ్చు లెల్ల గొల్చినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు..."కామెంట్‌లు