వేమన నాస్తికత్వం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
దేశ విదేశాలలో ఉన్న అందమైన ఆకర్షణీయమైన  కట్టడాలను చూసి దానిలో ఉన్న భగవత్ స్వరూపాన్ని వేడుకుంటే పరలోకం ప్రాప్తిస్తుందన్న అభిప్రాయంతో చాలామంది  గుళ్ళూ గోపురాలు తిరుగుతూ ఉంటారు  ఈ గుడి తయారవడానికి  ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మంచి రాళ్లు కావాలి, వాటిని చెక్కే స్థపతి ఉండాలి  ఒక గుడి నిర్మించినా మరొక అందమైన గుడి కావాలి. దానికీ దీనికీ సంబంధం ఉండకూడదు. ఆ లోపల మరొక రాతిలో శక్తి వుంటే ఆ విగ్రహాన్ని పెట్టి  ఓంకారంలో ప్రతిష్టించి, నిత్య పూజ పునస్కారాలతో కాలక్షేపం చేస్తూ అనేక మంది భక్తులను  ఆకర్షించడానికి  ఆ రాతి బొమ్మ కున్న గుణగణాలను ఆ రాతి కి పెట్టిన పేరు  ఉన్న భగవంతుడు ఎన్నో మహత్తులు చూపిస్తున్నాడని వారిని నమ్మినవారికి  సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మబలుకుతారు పురోహితులు, ఆ గుడి నిర్వాహకులు. ఏ గుడి కైనా వచ్చే భక్తులు  భగవంతుని చూసి మొక్కి తరించాలన్న అభిప్రాయంతో ఎవరైనా వస్తున్నారా ఆ గుడి సౌందర్యం చూడాలని ఆ చెక్కడాలలో  ఉన్న  పనితనాన్ని గమనించాలని  దేవాలయాలలో చెక్క బడి ఉన్న బూతు బొమ్మలను ఆస్వాదించాలని గుడికి వచ్చే అందమైన ఆడపిల్లలను చూడడానికి కొంతమంది, కాలక్షేపం చేయడానికి  మరికొంతమంది, అక్కడ జరిగే హరి కథల లాంటివి వినడానికి వచ్చే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఆ రాతి మహత్యం ఏమిటి మేధావులు చెప్పినట్లు  మనం తొక్కితే రాయి, మనం మొక్కితే  వేలుపు ఇవాళ కొన్ని కోట్ల ఆదాయం ఉన్న దేవాలయాలలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో  ఎంతమంది దొంగతనంగా తమ జేబులు నింపుకుంటున్నారో పత్రికాముఖంగా మనం చదువుతూనే ఉన్నాం. నిజానికి ఆ రాతికి మహత్తు ఉంటే  ఇలాంటి వారిని ఆ క్షణాల్లోనే శిక్షించాలి. మరి అలా జరగడం లేదు కదా. భక్తులు భగవంతుని నమ్ముతున్నారా నమ్మడం లేదా అన్న విషయాన్ని ప్రక్కన పెడితే  నిజమైన భక్తిశ్రద్ధలతో వీరు భగవంతుని మనసా వాచా కర్మణా నమ్మి  నమస్కారం చేసిన తరువాత  ఆ రాతిబొమ్మలో ఉన్న భగవంతుడు ఆశీర్వదించి మాట్లాడతాడా అన్నది  వేమన ప్రశ్న. ఆ దేవాలయానికి పేరుప్రఖ్యాతులు పెరిగేలా  అనేక పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు దాని నిర్వాహకులు  వారికి ఆదాయం మీద ఉన్న శ్రద్ధ మిగిలిన వాటిపై ఉండదు  ఇది జగమెరిగిన సత్యం  కనుక ఫలితం లేని చోటకు వెళ్లి  అగచాట్లు పడి రావడం కన్నా  నిజమైన భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అంతర్లీనమై  అంతః దృష్టితో  తదేకంగా చూస్తే కనిపిస్తాడని యోగులు చెప్పే మాటలు కూడా పూర్తిగా విశ్లేషించడానికి వీలు లేదు అనేది వేమన సిద్ధాంతం. ఈ విషయాల్లో ఆయనను అనుసరించి వారు ఉన్నారు వ్యతిరేకించిన వారు ఉన్నారు. అది వారి వ్యక్తిగతం.  మరి ఆ పద్యాన్ని మీరు కూడా ఒక సారి చదివి మీ నిర్ణయాన్ని  మీరు తీసుకోండి.

"రాళ్ళు దెచ్చి నరులు రమ్యమౌ గుడి కట్టి 
రాతి ప్రతిమజేసి ఖ్యాతి గను  దేవుడనచు మ్రొక్క దీవించి పలుకునా..."


కామెంట్‌లు