కలిసి వుంటే కలదు సుఖం ;-ఏ బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 శరీర నిర్మాణం ఎంత విచిత్రం  ఇది ప్రకృతిదా లేక పరమశివుని నిర్మాణమా  అని ఆలోచించే వాళ్ళు చింతనా పరులు. శరీరంలో ఉన్న ప్రతి అంగానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ఏ ఒక్కటి పనిచేయకపోయినా, శరీరం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. సామాన్యంగా మన పెద్దలు చెప్పే మాటల్లో ఐక్యమత్యంగా ఉండండి రా అంతా కలిసి ఉంటే అది బలం  లేకుంటే ఎండు గడ్డిలా ఉంటుంది ప్రతివారూ చులకనగా చూస్తారు. మీరు చేయాలనుకున్న పనులు చేయలేరు అని హితవు చెప్పడం మనం వింటాం. ఇవాళ ప్రేమ వివాహాలు, పెద్దలకు  చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం జరుగుతూనే ఉంది కానీ సనాతనులు అంటే పూర్వం మన పెద్దవాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి వివాహం చేసుకునే వారు. ఆర్థిక బలం కన్నా అంగబలం గొప్పది అని నమ్మిన జాతి మనది కొంత మంది విమర్శించవచ్చు, వంద మంది ఉన్న కౌరవులు  ఐదుగురు ఉన్న పాండవులకు భేదం లేదని చెబుతూ వారి అభిప్రాయాలను వెల్లడించవచ్చు కానీ ఐకమత్యంగా ఉన్న ఐదుగురి లో ఉన్న బలం చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో ఉన్న 100 మందిలో ఎలా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు తక్కువ. ఇక్కడ ధర్మాన్ని ఆలోచించి చెప్పే పెద్ద మనిషి ధర్మరాజు ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేసే తమ్ముళ్ళు ఉన్నారు. కనక విజయాన్ని పొందగలిగారు వందమంది ఉన్న కౌరవుల్లో, బహు నాయకత్వం ఉంది. ఎవరి పద్ధతి వారిది కానీ ఒకే పద్ధతికి కట్టుబడిన వాళ్లు చాలా తక్కువ. కనుక ఓటమి పాలయ్యారు అన్నది గమనించవలసిన విషయం శరీరం పెరగడానికి కావలసిన ఆహారాన్ని స్వీకరించడానికి  ఐదు వేళ్ళ తో కలిసిన  హస్తం ఎలా పనిచేస్తుంది  ఐదు వేళ్ళు ఐక్యమత్యంగా కలిసి ఉండడం వల్ల అన్నాన్ని కలపడానికి కానీ, నోటికి అందించడానికి కానీ పనికి వస్తుంది. ఐదు వేళ్ళలో ఒకటి పనిచేయకపోయినా ఆ హస్తం పరిస్థితి ఏమిటి? కృత్రిమ పద్ధతులను  అవలంబించవలసి వస్తోంది  అలాగే ఎందుకూ పనికిరాని వాడిని ఎండు గడ్డితో పోలుస్తారు  ఒక గడ్డి పూస  ఎందుకు పనికిరాదు ఏమీ చేయలేదు. కానీ  కొన్ని వందల  గడ్డి పూసలు కలిస్తే  దానిని  మోకుగా తయారు చేస్తే అది ఎంతో బలవంతమైన ఏనుగును కూడా కట్టి పారవేయడం మనం చూస్తున్న నగ్నసత్యం  అలా కలిసి ఉండడానికి ప్రయత్నించాలి తప్ప భేద అభిప్రాయాలతో విడిపో కూడదు అంటాడు వేమన ఆ పద్యం మీకోసం.

"ఐదు వేళ్ల బలిమి హస్తంబు పనిచేయు 
నందొకండు బిడ్డ పొందు చెడును  
స్వీయుడొకడు వీడిన జడుకదా పని బల్మి..."


కామెంట్‌లు