సర్ప లక్షణం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సమాజంలో అందరూ ఒక మాదిరిగా ఉండడం అసహజం.  పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి రాకపోవచ్చు. ఒకరి తత్త్వం మరొకరికి తెలియదు  ఒక్కొక్కరికి ఒక పని చేయడంలో చాకచక్యం ఉంటుంది. ఎంత త్వరగా చేద్దామన్నా మిగిలిన వాళ్లకు సాధ్యం కాదు. అలాగే సమాజంలో ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు.  ఉన్న వాళ్ళు మాత్రమే మంచి చేస్తారని లేని వాళ్ళు తప్పులు చేస్తారని అనుకోవడం భ్రమ.  మానసికంగా ఆలోచిస్తే   లేనివాడు దొరికినప్పుడు  ఉన్నవాడు అరిగినప్పుడు  అని మన పెద్దలు చెబుతారు  ఆకలితో నకనకలాడే వాడికి ఒక్క ముద్ద అన్నం దొరికినా వాడికి పాయసం లాగా ఉంటుంది. అది ఉన్న వాడికి పెడితే పాయసం కూడా  అసహ్యంగా కనిపిస్తోంది. సమాజంలో ఇలాంటి వాళ్ళను చాలా మందిని మనం గమనిస్తూనే ఉంటాం. సామాన్యంగా మనం బీదవారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఏది తినడానికి అందుబాటులో ఉంటుందో దానిని తెచ్చి తినమంటాడు అదే ధనవంతుడు అయితే పట్టించుకోరు  కారణం ఆకలి విలువ. అది తెలిసిన వాడికి జీవితం తెలుస్తోంది. మంచి చేసిన వారికి మంచి చెడు చేసిన వారికి చెడు చేసే వారు ఎంతమంది ఉంటారు. ఒక పాముని తీసుకువచ్చి  పాలలో పంచదార కన్నా అందమైన రుచికరమైన పటిక బెల్లాన్ని  వేసి తాగిస్తే  కడుపారా తాగి ఆకలి తీరిన తర్వాత ఎవరు ఆ పాలు పట్టారో వారిని కాటు వేయడానికి కూడా వెనుకాడదు అది దాని లక్షణం  ఎంత గొప్ప ప్రవక్త అయినా  చివరకు వేమన మహాశయుడు అయినా దాని తత్త్వాన్ని మార్చగలడా? దానికోరల్లో విషం లేకుండా చేయగలడా  అది అసాధ్యం, అసంభవం.
మన చుట్టూ ఉన్న మన  స్నేహితులను పూర్తిగా అర్థం చేసుకోగలమా? వారు చెప్పే తియ్యటి మాటలు వింటూ  మన హితాన్ని కోరే వాళ్ళే అని ప్రేమిస్తాం కానీ మన భ్రమను పటాపంచలు చేస్తూ మనసులో విషాన్ని పెట్టుకొని పైకి అమృతాన్ని వలకపోసే పెద్ద మనుషులు అని తెలియడానికి చాలాకాలం పడుతుంది. ఆ తెలుసుకున్న తర్వాత అయినా అతనిని దూరంగా పెడితే ఇతని ఆరోగ్యం బాగుంటుంది  లేకపోతే ఇతని అమాయకత్వాన్ని అతను వాడుకుంటాడు అపకారం జరుగుతుంది ఇతనికి. కనుక వేమన మనకు చెప్పే నీతి ఏమిటంటే ఏ వ్యక్తినైనా దగ్గరకు తీసే ముందు అతని తత్త్వాన్ని తెలుసుకో లేకుంటే మోసపోతారు అని హెచ్చరిక చేయడం వారి వంతు  ఆచరించలేక పోవడం మన దురదృష్టం. ఆ పద్యాన్ని ఒకసారి చదవండి

"కండ చక్కెరయును గలియ బాల్పోసిన  
తఱిమి పాము తన్నుదాకు గాదె  
కపటమున్నవాని గన్పెట్ట వలెనయా...


కామెంట్‌లు