పాద తీర్థ మహిమ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వేమన కాలానికి  ప్రస్తుతం ఉన్న పరిస్థితి కన్న తక్కువ గా  దేవుడన్నా మఠాధిపతులన్నా, గుడులన్నా ఆరాధన పెరిగింది. అక్కడికి వెళ్లి వారు చెప్పే గొప్ప ప్రవచనాలను విని వారి పాద తీర్థం తీసుకోవాలన్న అభిలాషతో వస్తారు. అక్కడ పురోహితుడు అందరికీ ఆ జలం ఇస్తాడు ఎంతో తృప్తిగా ఇంటికి వెళ్లిపోతారు హాయిగా ప్రశాంతంగా భగవంతుడినే చూసినంత ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అప్పటికే మఠాలలో  దొంగ స్వాములు  పెరిగిపోయారు. వారంతా నిజంగా భగవంతుడి మీద ఆర్తితో  భక్తితో  వచ్చి పీఠాన్ని  నెల కొల్పిన వారేనా 13 వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ క్రమం ఈ రోజున పతాక స్థాయికి వచ్చింది. ఏ స్వామిని చూడండి కోట్లు తప్ప లక్షలు కాదు వారి ఆస్తి. విమానాలలో తప్ప వేరే వాహనాలలో కాదు వెళ్ళేది. వేమన మరోచోట చెప్పినట్లు కాషాయం కట్టినంత మాత్రాన అతను పవిత్రుడు కాదు అని. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు  కాషాయం కట్టిన ప్రతి వాడిని నమ్మి  వారి బోధలు విని వారు చెప్పింది వేదం అనుకుంటూ  వాడికి శిష్యుడిగా వెళ్ళకు  ఎవరు నిజమైన శక్తి పొందడానికి  కృషి చేస్తారో  వారిని వెతికి పరీక్షించి అప్పుడు వారికి శిష్యునిగా చేరు కానీ కొంతమంది ప్రవచన కారులు చెప్పినట్టుగా పిచ్చి ముదిరి పోయింది అని ఎవరు ఏమి చెప్పినా వారు వినరు.  వారి పాద పూజ చేసినంత మాత్రాన తాము చేసిన పాపాలన్నీ పోతాయన్న భ్రమలో ఉంటారు కొంతమందికి నమ్మకం అది చివరికి మూఢ నమ్మకంగా తయారై  జీవితాంతం ఆ భ్రమ లోనే జీవిస్తూ ఉంటారు. దానిని ఎవరూ మార్చలేరు వేమనతో సహా. ఈ ప్రజల మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని కొంతమంది దొంగ శిష్యులు బయలుదేరి ఆ గ్రామం నడిబొడ్డున ఉన్న బావిలో నీళ్ళు తీసుకువచ్చి  ఇది స్వామి వారి పాదాలను కడిగిన తీర్థం అని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. తరువాత వారికి తోచిన ధనాన్ని  పొందుతారు. ఈ వ్యాపార సరళి పెరగడంతో అసలు గురువు ఎవరో నకిలీ గురువు ఎవరో మనకు తెలియకుండా పోతుంది. అలాంటి పాదతీర్థం  తీసుకోవడం వలన ఏమైనా ప్రయోజనం కలుగుతుందా లేదా అని ఏ ఒక్కరూ ఆలోచించరు. అదంతా వారి నమ్మకం ఆ మాయలో పడవద్దు అని హెచ్చరిక చేయడం కోసమే ఈ పద్యం మన ముందుంచారు వేమన  ప్రతి ఒక్కరూ చదవాల్సిన పద్యం మీ ముందుకు తీసుకు వస్తున్నాను. మీరు కూడా ప్రయత్నం చేయండి.
"ఊరి నడిమి బావి యుదకంబు గొని తెచ్చి 
పాద తీర్థమనుచు బ్రమయ జేయ 
పాద తీర్థ మన్న ఫలమేమి కద్దురా..."కామెంట్‌లు