వార్తా పత్రికల వల్ల ఆకాశవాణి దూరదర్శన్ ల ద్వారా అనేక కొత్తకొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. వింతలూ విశేషాలతో పాటు దేశంలో జరుగుతున్న మనకు తెలియని విషయాలను కూడా వెలికితీసి మన ముందు ఉంచుతుంది ఈ మాధ్యమం అయితే చెప్పడంలో, రాయడంలో కొంచెం అతిశయోక్తులు ఉండవచ్చును తప్ప వార్తల్లో అబద్ధం ఉండదు. ఎవరో ఒక బీదవాడు తన పాత ఇంటిని పడగొట్టి కొత్త దానిని నిర్మించాలని తలచి తన కుటుంబ సభ్యులతో కలిసి పాత ఇంటిని పడగొట్టడం జరుగుతుంది. అనుకోకుండా దానిలో అంతకుముందు ఎప్పుడో ఎవరో దాచి ఉంచిన ధనం కానీ, బంగారం కానీ అతి జాగ్రత్తగా వారు దాచుకున్నవి వీరికి కనబడతాయి వాటిని తన సొంతం చేసుకొని ఎవరికీ తెలియ కుండా తాను లక్షాధికారినో, కోటీశ్వరుడినో కావాలని ఆలోచిస్తాడు.
ప్రపంచంలో ఏ రహస్యం కూడా గుట్టుగా ఉండదు. ఇంటిలో ఆడవారే తమ గొప్పలు చెప్పుకోవడానికి కానీ, అలాగే ఎంత ఆస్తి ఉందని వారి ముందు ధనవంతులుగా ప్రవర్తించాలని కానీ ఏదో మాటల సందర్భంలో తప్పకుండా ఆ విషయం బయటకు వస్తుంది దీనికి తగినట్లు ప్రభుత్వ యంత్రాంగం ఊరుకుంటుందా? దుర్భిణీ వేసి వెతుకుతుంది ఈ విషయాన్ని గ్రహిస్తుంది. దానిని తన సొంతం చేసుకుని ఆనాటి బంగారం కానీ, డబ్బులు కానీ, అది అక్కడ ఎలా ఉన్నాయి వీరికి ఎలా దొరికింది అవి ఏ కాలం నాటివి అప్పట్నుంచి భూమిలో ఉండడానికి కారణం ఏమిటి ఆ డబ్బు కాగితాలు ఈ రోజుల్లో చలామణి అవుతాయా లేదా? ఈ విషయాలన్నిటినీ కూలంకషంగా పరిశీలించి ఆ తర్వాత ఆ దొరికిన నిధిని ప్రభుత్వ పరం చేయాలా, ఆ యజమానికి ఇవ్వాలా అన్న విషయాన్ని తేల్చి వారికి అప్పగించడం జరుగుతోంది. ఆ దాచిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు కష్టపడి తాను అనుభవించిన తరువాత మిగిలిన దానిని ఆ కుటుంబం లో ఎవరైతే ఉన్నారో వారి అందరికీ లెక్కలు పెట్టి ఇది నీ వంతు అది నా వంతు అంటూ భూస్థాపితం చేసి అది శాశ్వతంగా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి వాడుకోవచ్చును అన్న అభిప్రాయంతో అక్కడ దాస్తాడు వాన రాకడ ప్రాణం పోకడ ఎవడికైనా తెలుస్తుందా? ఎంత దాచిన వారైనా ఎవరు ముందు చనిపోతారు ఎవరు వెనక చనిపోతారు ఎవరు చెప్పగలరు. పిసినారి తనంతో వారు వాడక ఎదుటి వారికి దానం చేయక వారు మరణించిన తరువాత ఒక కాసైనా తీసుకు వెళ్ళడానికి అవకాశం లేక ఆ డబ్బు అక్కడ మురిగి పోతే తరువాతి తరం వారికి అది వస్తుంది అది కూడా వారి హస్తగతం కాదు దానికోసం ఎందుకు ఇంత తహతహలాడుతున్నారు అని వేమన మనలను ఎద్దేవా చేస్తున్నాడు ఆ పద్యం మీ కోసం.
"ఇంటిలోని ధనము నీది నాది యనుచును
మంటిలోన దాచు మంకు జీవి కొండ బోదు వెంట గుల్ల కాసైనను..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి