కొరగాని బ్రతుకు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రామాయణంలో రావణాసురుడు మరణశయ్యపై ఉన్న క్షణాన సాక్ష్యాత్తు భగవత్స్వరూపం  శ్రీరామచంద్రమూర్తి, వారి వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించి రాజనీతిని గురించి తెలియజేయండి అని ఎంతో వినయంతో అడిగాడు. రావణుడు ఎంతో సంతోషించి  అన్ని శుభకార్యాలకు, అశుభకార్యాలకు మూలం మనసు. ఆ మనస్సు నీకు మంచిది అని దేని గురించి చెప్పిందో దానిని వెంటనే చేయడం అలవాటు చేసుకో. తరువాత చేద్దామన్న నిర్లక్ష్యంతో ఉంటే జీవితంలో మళ్ళీ ఆ పని చేయలేవు. నీ మనసు దేనిని చెడు అని చెప్పిందో జీవితకాలంలో దాని జోలికి వెళ్లకు అలా చేయడం వల్ల నేను మరణశయ్యపై ఉన్న పరిస్థితి ఏర్పడింది  అని ఉదాహరణలతో సహా చెప్పాడు రాజనీతిజ్ఞుడు రావణాసురుడు. వేమనామాత్యుడు చెప్పిన అద్భుతమైన  పద్యం  ఎవరైనా సాయం చేయమని  వచ్చినవారికి రేపు మాపు  అంటూ కాలం గడుపుతూ  ఇవ్వడానికి మనసు అంగీకరించక సంపాదన మీద వ్యామోహం పెంచుకొని  రూపాయికి రూపాయి సంపాదించాలి అనే అభిప్రాయంతో  ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు మనిషి. తన చేతి నుంచి డబ్బులు ఇతరులకు ఇచ్చేటప్పుడు ఎంత బాధ పడతాదో మనిషి. అందుకే ఇవ్వడానికి మనసొప్పక రేపని మాపని అతన్ని అలా తిప్పుతూనే ఉంటాడు.  అలా కాకుండా అసలు నీవు ఏమిటి? నీ స్థితి ఏమిటి? అని ఆలోచించుకొని ఎంత వరకు దానం చేయాలని అనుకుంటున్నావో  అంతా వారికి దానం చేస్తే వారి  అవసరము తీరుతుంది నీ మనసుకు ఆనందము దొరుకుతుంది. అలా కాకుండా నీవు చేసినట్లు  చేస్తే  అతని పని కాదు నీకు తృప్తి రాదు నీ జీవిత కాలం ఎంత? అది నీ చేతిలో ఉందా? రేపు మాపు అని తిప్పుతున్నావు రేపు ఎల్లుండి బ్రతికి ఉంటానన్న నమ్మకం వుందా నీ జీవితం నీ చేతిలో ఉండే అదే ఆలోచిస్తావు రేపు నా శరీర స్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించు ఎప్పుడైనా మట్టిలో కలిసిపోయేదేగా శరీరం అని ఊహించు మీ కుటుంబానికి సరిపడినంత ఉంచుకొని మిగిలిన దానిలో కొంతయినా దానధర్మాలకు వినియోగిస్తే  వారు ఆనందిస్తారు నీకు తృప్తిగా ఉంటుంది జీవితంలో ఆ తృప్తి లేకపోతే ఈ పరిస్థితికి అర్థమే లేదు కదా అని అంటాడు వేమన ఎందుకూ పనికిరాని  జీవితం ముగిసిన తర్వాత  పిసినారిగా తన తనువును అంతం చేసుకోవడం తప్ప ఏ మానవ శరీరానికి  ప్రయోజనం ఉండదు అంటాడు వేమన ఆ పద్యాన్నీ చదవండి. 

"దాన ధర్మములకు దగు రేపురేపని 
కాల వ్యయము జేయు గష్ట జనుడు  
తానునెమియవునొ తన బ్రతికే మవునొ..."


కామెంట్‌లు