స్వతంత్ర భారతం ;- సయ్యద్ జహీర్ అహ్మద్ ;-చరవాణి:9505152560
ప్రక్రియ: సున్నితం
==============
వర్తక నిమిత్తం ప్రవేశం
బ్రిటిషర్ల వ్యూహాత్మక పాదాక్రాంతం
బానిస శృంఖలాల ఆధిపత్యం 
చూడచక్కని తెలుగు సున్నితంబు!
         
స్వరాజ్య సాధనకు ఆరాటం
సమర యోధుల పోరాటం
ప్రాణాలు అర్పించిన సంకటం 
చూడచక్కని తెలుగు సున్నితంబు!
       
కులమతాల పట్టింపులు శూన్యం
అందరూ ఏకతాటిపై నడక
అహింసా మార్గంలో సాధ్యం
చూడచక్కని తెలుగు సున్నితంబు!
          
సత్యం ధర్మం శౌర్యం
శాంతి సహనం సద్భావం
సమైక్యం స్వతంత్ర విజయం  
చూడచక్కని తెలుగు సున్నితంబు! 

అహింసా మార్గంలో గాంధీజీ
హింసా మార్గంలో నేతాజీ 
గెరిల్లా పోరాటంలో అల్లూరి 
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు