సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు;-య్యద్ జహీర్ అహ్మద్ --చరవాణి:9505152560
 ప్రక్రియ: సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
==========================
            356
సాహితీ బృందావన వేదిక
సున్నితం ప్రక్రియ నిర్వహణ
నాలుగు పంక్తుల కవిత
చూడచక్కని తెలుగు సున్నితంబు!
            357
సరళ పదముల కవిత్వం
నాలుగు పంక్తుల భావన
ఈచ్ఛా రీతిన అంత్యప్రాస
చూడచక్కని తెలుగు సున్నితంబు!
            358
సృజన కర్త సునీతమ్మ 
మేధావుల ప్రశంసలు చూరగొన్న
వ్రాయ సౌలభ్య రీతీనమ్మ
చూడచక్కని తెలుగు సున్నితంబు!
            359
మకుటం వున్న మహారాణి
మూడు పదాల ధోరణి
సున్నితం స్పర్శించు నవనీతం
వివిధ ప్రక్రియల్లో ఉన్నతం
చూడచక్కని తెలుగు సున్నితంబు!
            360
పరిశీలకుల విశేషమైన సమీక్షలు
ప్రతిభా పాటవాలకు పురస్కారాలు
ఉత్సహించు ప్రశంసా పత్రాలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు!
        *

కామెంట్‌లు