.పద్యము కవిత సమాజం పై ప్రభావం;-జి.లింగేశ్వర శర్మ9603389441
పద్యముచరిత్రదెలుపును
పద్యముసంస్కృతినిపంచుపరిపరివిధముల్
పద్యముసమాజహితమై
పద్యమురంజింపజేయుపాఠకులమదిన్

పద్యమువీనులవిందై
హృద్యముగానిలచిపోయిహృదిలోనెపుడున్
పద్యముసమాజమందున
విద్యనువిలువలనుబెంచువిస్తృతముగనున్

అందించునుకవికలమే
స్పందించియురాసిమనకుపద్యాలెన్నో
సుందరపదాలతోడను
డెందముకదిలించువేసిడికవితలింకన్

వేలేత్తిచూపుచునుకవు
లీలోకమునందుతప్పులెక్కడయున్నన్
మేలునుగోరుచుజనులను
మేలుకొలుపకవితలల్లిమేటిగనిలచున్

వందేమాతరగీతము
ముందుకునడిపించెనాడుమొత్తంజాతిన్
సుందరభరతావనిలో
అందరిలోస్ఫూర్తినింపియద్భుతరీతిన్


కామెంట్‌లు