ఆశయం; -వి. లోహిత, పదో తరగతి సెక్షన్ 'డి', జడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్, సిద్దిపేట. సెల్ :9704499253.

 అనగనగా ఒక అడవిలో ఒక చిన్న కుటుంబం ఉండేది .ఆ కుటుంబం చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్న అడివిలో కట్టెలు కొట్టి బ్రతికే వాళ్ళు వాళ్లకు ఒక కూతురు ఉంది .ఆమె పేరు సరస్వతి తను నల్లగా ఉంది. తనకు చదువు మీద చాలా ఆశ ఉండేది. తాను చదువుకొని వాళ్ళ అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలి అనుకుంది. కానీ వాళ్ళ దగ్గర చదువుకోవడానికి డబ్బులు లేవు. తను తన ఆశను వాళ్ళ నాన్నకు చెప్పలేదు.  ఒకరోజు తను పుస్తకం చదవడం చూసిన వాళ్ళ నాన్న తనను బడిలో చేర్పించాడు .కానీ బడిలో తనను అందరూ పేద అమ్మాయి అని నల్లగా ఉంటుంది అని హేళన చేసేవారు. కానీ తను అవి ఇవి పట్టించుకోలేదు. మంచిగా చదువుకొని ఒక జిల్లా కలెక్టర్ గా వచ్చింది. అప్పుడు తను పేద పిల్లలకు ఒక బడి కట్టించింది. తను అనుకున్నట్లుగానే వాళ్ళ అమ్మానాన్నలని ఏ కష్టం రాకుండా చూసుకుంది. పేద వాళ్లకు సాయం చేస్తూ సంతోషంగా తన జీవితం సాగించింది .
నీతి:
 చదవడానికి రంగు రూపు అవసరం లేదు- చదువు ప్రతి ఒక్కరికి సమానమే.
కామెంట్‌లు