స్వతంత్ర భారతం;-తంగెళ్ళపల్లి ఆనందాచారి--చరవాణి :9848683377
ప్రక్రియ : సున్నితం 
================
ఆంగ్లేయులు నమ్మించిరి మనలను 
వాణిజ్యంపేరుతో మోసగించిరి జనులను
బానిసలను చేసిరి భారతీయులను
చూడచక్కని తెలుగు సున్నితంబు

అహింసా మంత్రంతో బాపూజీ 
సాయుధ తంత్రంతో నేతాజీ
సాహసమే ఊపిరిగా భగత్ 
చూడచక్కని తెలుగు సున్నితంబు

రవి అస్తమించని సామ్రాజ్యాన్ని 
తరిమిరి ఆంగ్ల పాలకుల్ని 
తుడిచిరి భారతమాత అశ్రుపుల్ని
చూడచక్కని తెలుగు నున్నితంబు 

కులాల కుంపటి లేకుండా
మతాల మంటలు రాకుండా 
ఎగిరెను మువ్వన్నెల జెండా
చూడచక్కని తెలుగు సున్నితంబు

చేలు నీళ్లతో ప్రకృతి
ప్రపంచానికే ఆదర్శమైన సంస్కృతి
విశ్వగురువు నా భరతజాతి
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు