స్వతంత్ర భారతం ; బత్తిన గీతాకుమారి--చరవాణి:9866882029
ప్రక్రియ:సున్నితం!
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు!
=======================
సమర యోధుల బలిదానాలు!
ప్రజల ఐక్యతా ఉద్యమాలు!
స్వతంత్రభారతి విముక్తికి మూలాలు!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఝాన్సీరాణి వీరోచిత పోరాటస్ఫూర్తి!
అల్లూరి విప్లవపంథాలోని ఆర్తి!
నేతాజీ సాయుధసంగ్రామ స్ఫూర్తి!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మహాత్ముని సత్యాగ్రహ ఆయుధం!
అహింసా సిధ్ధాంత ప్రబావం!
ఉద్యమాల సాఫల్యానికి మూలసూత్రం!
చూడచక్కని తెలుగు సున్నితంబు! 

వ్యర్థంకాకూడదు అమరుల త్యాగాలు!
యువతా మేలుకోండి! ఏలుకోండి!
మీదే!  మీదే! స్వతంత్రభారతం! 
చూడచక్కని తెలుగు సున్నితంబు! 

భిన్నత్వంలో దాగిన ఏకత్వం!
ఏకత్వంలో ఒదిగిన భిన్నత్వం!
లౌకిక తత్వమే భారతీయతత్వం!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు