శ్రీ ఉమా మహేశ్వరా భ్యాం నమః! "శంకరప్రియ.," శీల., సంచారవాణి: 99127 67098
 👌శ్రీమతి ఉమాదేవి
సకల ప్రాణి కోటికి   
     జగతి కంతకు జనని!
శంకర ప్రియులార! (1)
👌శ్రీమ న్మహేశ్వరుడు
సర్వ జీవ రాశికి
     ఈ జగతికి జనకుడు!
శంకర ప్రియులార! (2)
         ( శంకర ప్రియ పదాలు.,)
👌శ్రీఉమా మహేశ్వరులే.. పురాణ దంపతులు!  ఈ చరాచర ప్రపంచ సృష్టికి, సమస్త ప్రాణికోటికి .. తల్లిదండ్రులు! దాంపత్య బంధమునకు .. మూల కారకులు!
👌"శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమః!" అని, ప్రతీ శుభ కార్యము లందు.. ఆది దంపతులను స్మరించు చున్నాము! భవానీ భవులకు రెండు చేతులను జోడించి నమస్కరించు చున్నాము!
🙏వాగర్దావివ సంపృక్తౌ
     వాగర్ధ ప్రతిపత్తయే!
     జగతః పితరౌ వందే
     పార్వతీ పరమేశ్వరౌ!
      ...అని, మంగళాచరణ శ్లోకముతో.. "రఘు వంశం" మహా కావ్య రచన ప్రారంభించారు!  "శబ్దార్ధ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరు లను" భక్తి ప్రపత్తులతో ప్రార్ధించారు, మహాకవి, కాళిదాసు! శివమస్తు!
    🚩తేట గీతి 🚩
🙏వఱలు వాగర్థ నిత్య సంబంధ ముట్లు
     ఏకమౌ పార్వతీ పరమేశ్వరులకు
      జగతి పితరుల కేను అంజలి ఘటింతు!
      కలిత వాగర్థ విజ్ఞాన మలవడుటకు.
     ( తెలుగు సేత: శ్రీ అద్దంకి సీతా రామయ్య., )

కామెంట్‌లు