పశ్చిమామ్నాయ శారదా పీఠాధిపతి"శంకరప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌శ్రీమదాది శంకర
     మఠమ్ములు పీఠములు
     సాంస్కృతిక కేంద్రములు!
          ఓ తెలుగు బాల!
          ( తెలుగు బాల పదాలు., "శంకర ప్రియ".,)
👌జగద్గురు ఆది శంకరాచార్యుల వారు..  నాలుగు దిక్కులందు మఠములను, పీఠములను నెలకొల్పారు! వాటిలో ఒకటి.. ద్వారకలో నున్న పశ్చిమామ్నాయ పీఠమునకు అధిపతి.. "శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి!"! వారు.. ఎనిమిది దశాబ్దములుగా; మన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు, అహరహము కృషి సల్పారు!
 👌 శ్రీస్వామి వారు.. ఎందరెందరో మహానుభావులకు, యతీశ్వరులకు, ధార్మికులకు, అద్వైత జ్ఞానబోధ కావించారు! "ధర్మ సమ్రాట్టు"గా... భారతావని "ధీరోదాత్త ధార్మిక ప్రతినిధి"గా... 
శిష్యకోటిని పునీతులను చేసారు! ఆ మహాత్ముడు.. 99వ. ఏట నిర్యాణం చెందారు! ఆ పరమాచార్యులకు
యావద్భారత జాతి,  నివాళులు సమర్పించింది!( శ్రద్ధాంజలి ఘటించింది! )
🚩ఉత్పల మాల🚩
     ద్వారక పీఠమందు తమ ధార్మిక జీవన సారమంతటిన్
     ధారగ పోసినట్టి నిరతమ్మును వేదవిశిష్ట వైభవో
     ధ్ధారణ జేసినట్టి ఘను, దైవస్వరూపుల శంకరరార్యులా
      ధీరులకున్ స్మరించుచు సుదీప్తి నివాళు లొసంగెదన్ మదిన్!
     (పద్య రచన: డా. శాస్త్రుల రఘుపతి)
🚩జయ జయ శంకర!
    హర హర శంకర!

కామెంట్‌లు