న టే శ్వ రి; - శంకరప్రియ., శీల.,; -సంచారవాణి: 99127 67098
 🙏నటరాజు యగు శివుని
సహధర్మ చారిణివి!
      నటేశ్వరి! ప్రియంకరి!
శ్రీమాతా! శివాని!
        ( శ్రీమాతా శివాని పదాలు., శంకర ప్రియ.,)
👌పరమేశ్వరుడు.. ఆనంద తాండవము చేయువాడు! కనుక, "నటరాజు" అని పేరు! ఆ స్వామివారికి అనుకూలవతి యగు ధర్మపత్ని! కనుక, శ్రీమాతకు.. "నటేశ్వరి" అని, పేరు వచ్చింది!
    ఈ స్థావర జంగమాత్మకమైన, జగమంతా ఒక నాటక రంగము! దీనికి, సూత్ర ధారులు.. ఆది దంపతులైన, "నటేశ్వరీ నటేశ్వరులు"! ఈ జగత్తునందు.. మనమంతా పాత్ర ధారులము!
🙏"నంది విద్యా నటేశ్వరి" అని; శ్రీమాతను ప్రస్తుతించారు, గురుదేవుడైన హయగ్రీవ స్వామి వారు!
      "ఓం నటేశ్వర్యై నమః!" అని; శ్రీ లలితా సహస్ర నామములలో.. "734వ నామము"!
         🚩తేట గీతి🚩
  🙏నన్నుఁ గావు నటేశ్వరీ! సన్నుతాత్మ!
    యీ జగ న్నాటకంబున నింత వరకు
      పాత్రలో మున్గి నిన్ను నే వదలి యుంటి
      ఆడలేనింక రక్షించు తోడనుండి.
       (శ్రీ లలితా సహస్ర రహస్య నామ స్తోత్రం, పద్య రత్నావళి, రచన: శ్రీ చింతా రామకృష్ణారా

కామెంట్‌లు