కామధేనువు.. విద్య; -శంకరప్రియ , శీల.,;-సంచారవాణి: 99127 67098
 👌జ్ఞానామృతము నొసఁగు
 కామధేనువు.. విద్య!
     ఆ బాల వృద్ధులకు!
 ఆత్మ బంధువులార!
      ( ఆత్మబంధు పదాలు., శంకర ప్రియ.,)
👌"కామ ధేనువు".. దేవలోకంలో నున్న గోవుగా; మన ఇతిహాసములు పేర్కొనుచున్నాయి! ఆ  గోమాత.. ఆరాధకులు, మరియు సాధకు లందరికీ.. ఇష్ట కామ్యములను నెరవేర్చు చున్నది! పంచభక్ష్య పరమాన్నములను అనుగ్రహించు చున్నది!
👌"విద్య" అనగా.. ఆధ్యాత్మిక జ్ఞానము, మరియు భౌతిక విజ్ఞానము! అది.. విద్యార్థులైన సకల మానవాళికి.. "జ్ఞాన క్షీరము"ను ప్రసాదించు కామధేనువు వంటిది!అని, అభివర్ణించారు మనవారు!
     
👌విద్య..  "కామ ధేనువు"వలె, కాలము కాని కాలమందును, ఫల మొసంగును! పరిచయము లేని పరదేశ మందును, "తల్లి"వలె పోషించును! నిల్వజేసిన "ధనము" వలె, సమయ మందు సహాయ మొనర్చును!" అని, అపర మేధావి, చాణక్య మహాశయుడు; "విద్య వైభవము"ను వివరించారు
   
🚩తేటగీతి పద్యం🚩
     ఎచట కేగిన నిన్నంటి అచట నుండు;
      "జనని" తీరున బ్రతుకును చక్కదిద్దు;
      తలప సాహాయ్య మొనరించు "ధనము" వోలె;
       "కామ ధేనువు" విద్యయే కనుము నరుడ!!
( కవి, అవధాని: శ్రీ  జంధ్యాల జయకృష్ణ బాపూజీ., )

కామెంట్‌లు