శివ కీర్తన ; -ప్రభాకర్ రావు గుండవరం (మిత్రాజీ )ఫోన్ నం.994926763
ఎంత మంచి వాడవయ్యా
ఓ శంకరా !!
నువ్వు.....పిలువగానే వేంచేసితివయ్యా
శివకేశవా !!

భక్తులను బ్రోచేటి..... భోళా శంకరా!!
మా విన్నపాలు... విని పోవయ్యా విరూపాక్షుడా!!

సకల లోకములు ఏలే స్వామీ
ఓ సర్వేశ్వరా!!
నా ప్రార్థనలు మన్నించి నన్ను కరుణ  జూడవా !!

వెండి కొండపైన నీవు ధ్యాన ముద్రలో ఉండీ........
అఖిల బ్రహ్మాండాన్ని ఆదుకొందువూ స్వామీ
మా పాపాలన్నీ పరిహారం చెయ్యి........ పరమేశ్వరా!!

కష్ట సుఖములు అన్నీ కూడా
కావడి కుండలని చెప్పినావు
మమ్ములను రక్షింప భూలోకములో వెలిసినావు

ఆదిదేవ నీవు తప్ప........ మాకు అన్యులె వరు ఉన్నారయ్యా
ఆదరించి కాపాడు స్వామీ..... విశ్వేశ్వరా!!
🌹🌹🌹

కామెంట్‌లు