స్వతంత్ర భారతం;- డా.జి.భవానీ కృష్ణ మూర్తి;-చరవాణి...9959070510

ప్రక్రియ.సున్నితo
=============
అందమైనది మన భారతదేశము
ప్రకృతి వనరులకు అదినిలయము
వేద వేదాంగములు పుట్టినదేశము
చూడచక్కని తెలుగు సున్నితంబు


రెండు శతాబ్దుల పరపాలనము
ఎందరోమహనీయులత్యాగఫలము
శాంతి అహింసలే ఆయుధము
చూడచక్కని తెలుగు సున్నితంబు


చేసినారు ఉప్పు సత్యాగ్రహము
ఆలపించిరి వందేమాతర గేయము
నడిపిరి క్విటిoడియా ఉద్యమము
చూడచక్కని తెలుగు సున్నితంబు


బాపూజీ అహిoసా వ్రతము
భగతసింగ్ అల్లూరిప్రాణత్యాగము
నేతాజీ చేసే జైహింద్ నినాదము
చూడచక్కని తెలుగు సున్నితoబు

ఎందరో వీనుల త్యాగఫలము
మన స్వతంత్ర భారతము
దీనిని కాపాడుకోవాలి అందరము
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు