సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు; డా.జి.భవానీ కృష్ణ మూర్తి--చరవాణి.. 9959070510
 175.
తెలుగు తల్లికి శతకహారము
నూతనప్రక్రియ ఆవిష్కరణము
వైవిధ్య భరిత అంశము
చూడచక్కని తెలుగు సున్నితంబు
176
సునీతమ్మఊహాశక్తికి నిదర్శనo
తెలుగు భాషాభివృద్ధి ఆదర్శం
కవులనుప్రోత్సహించడంలక్ష్యo
చూడచక్కనితెలుగుసున్నితబు
177
శతక లక్షణాలున్న ప్రక్రియ
మకుట నియమమున్న ప్రక్రియ
నాలుగు పాదాలున్న ప్రక్రియ
చూడచక్కని తెలుగు సున్నితంబు
178
సరికొత్త ప్రక్రియ ఆవిష్కరణ
కవులకు ఇస్తారు ప్రేరణ
కవులు సమీక్షలకై నిరీక్షణ
చూడచక్కనితెలుగు సున్నితంబు
179.
ప్రతివారం కొత్త అంశము
సున్నిత రచనలో ఉత్సాహము
బిరుదులతో కవులకి ప్రోత్సాహము
చూడచక్కని తెలుగు సున్నితంబు
180
చక్కని సున్నితాలతో కవులు
కవులప్రోత్సహించుసమీక్షకులు
వెలువడే చక్కని సoకలనాలు
చూడచక్కనితెలుగు సున్నితంబు

కామెంట్‌లు