కొత్తగా ఆలోచించండి;-కంచనపల్లి ద్వారకనాథ్,B.A.,B.F.A;-చరవాణి:9985295605., 7981499423

 మనిషి విజ్ఞానాన్ని సముపార్జించి ప్రగతి పథంలో ఎన్నో  కొత్త ఆవిష్కరణలు అనాది నుండి  జరుగుతూనే ఉన్నాయి . అయితే ఈ నాడు చదువుతున్న  వారి    విజ్ఞానం జీవనోపాది కొరకు అని , తల్లి  తండ్రులు , గుaరువులు  వత్తిడితో  ఇంజినీర్లు ,డాక్టర్లు అవ్వడం కోసం ,సంపాదన కోసం  అన్నట్లు తయారైంది . 
నేడు విద్యార్థులు ఎన్నో పెద్ద చదువులు చదువుకోవడానికి ఎన్నో కోర్సులు , ఇంజనీరింగ్ , మెడికల్ కళాశాలలు ఉన్నాయి . ఇంకా   ఎన్నో  కొత్త కళాశాలలు ప్రభుత్వం ,ప్రైవేటు వారు   స్థాపిస్తునే వున్నారు .
  ఈనాడు  నేర్చిన విజ్ఞాన౦ , మేధస్సును ఉపయోగించి  సాంకేతికంగా  అభివృద్ది తో ఎన్నో ప్రజలకు ఉపయోగపడే  కొత్త    ఆవిష్కరణలు తయారు చేస్తున్నారు . ఇవి  వ్యాపారాభి వృద్దిలో లాభాలు సాధించి పెడుతున్నాయి . 
 ఇంజనీరింగ్ కళాశాలల్లో   ఎందరో ఎలక్ట్రానిక్ ,మెకానిక్ లాంటి కోర్సులు చదువుతున్న ఈ రోజుల్లో వాళ్ళ కాలేజి ప్రాజక్ట్ వర్క్స్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్  వాహనాలు రోబోలు లాంటి  , కొత్త  ఆవిష్కరణలు ఎన్నో  చేసినప్పటికీ  అవి సామ్మన్యునికి అందు బాటులోకి వచ్చే  సాధనాలు లైతే ఎంతోమందికి మేలుకలిగిస్తాయి  .
ఈ నాడు ఏంతో మంది పిల్లలు బోరు  ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పవడం లేదా  మనకున్నకొద్దిపాటి టెక్నాలజీతో   కష్టపడి కాపాడడం జరుగుతూనే వున్నాయి .డ్రైనేజి లొ పారిశుద్ధ  కార్మికులు  దిగి  చచనిపోవడం ,వరదల్లో చిక్కుకుని వారిని శులువుగా రక్షించే టెక్నాలజీలు లేకపోవడం , భవన కార్మికులు పైనుండి దారాలపై వేలాడుతూ రంగులు వేయడం ప్రమాదాలకు గురికావడం , గోడలు ,భవనాలు కూలినప్పుడు శిథిలాల క్రింద ఇరుక్కు పోయిన వారిని రక్షించడం కోసం పెద్దపెద్ద పరికరాలు తెచ్చి  శ్రమపడి ,గంటలకొద్దీ కష్టపడ్డడం  వంటివి మనం చూస్తూనే వున్నాం . ఇలాంటి సమస్యలు గురి౦చి ఆలోచించి ఇంజనీరింగ్  చదువుతున్న వాళ్ళు , ,మేధావులు సరి కొత్త ఆలోచనలు చేసి కొత్త ఆవిష్కరణలు  చేయాలి . వీటివల్ల ఎందరో ప్రాణాలు  కాపాడడమేకాక ,సమాజానికి ,కష్టజీవులకు మేలు   కలుగుతుంది  కుటుంబంలో  కార్మికుల్లో ,కూలీల్లో కుటుంబానికి ఆసరా అయిన ఒకవ్యక్తి చనిపొతే మిగిలినవాళ్ళు కి ఎంత నష్టమో గమని౦చాలి . 
 ఎన్నో  కష్టాల్ని , బాదల్ని ,అవమాలని  శ్రమని  , తట్టుకుని తన తోటి వారికి మేలు కలగాలని ఏడేళ్లకు పైగా శ్రమించి    అంతగా చదువు లేకపోఇయిన  ఎన్నో పరికరాల పని తీరును  పరిశీలించి   , పరిశోధించి , ఎన్నో ఫ్యాక్టరీలు , యంత్రాలను  గమని౦చి చివరికి తను అనుకున్న ఆసు యంత్రం [చేనేత  యంత్రం] తయారుచేసి తన తోటివారికి  చేనేత కష్టాలను తొలగించిన చింతకింద  మల్లేశం   ప్రపంచ వ్యాపితంగా పేరు  పొంది పద్మశ్రీ అవార్డు తో పాటో ఎన్నో అవార్డులు ,  రివార్డులు పొందిన మేథావి . [   మల్లేశం బయోపిక్   సినిమాగా తీయడం జరిగింది ] ని ఆదారంగా   ఈ మల్లేశం   ,అబ్దుల్  కలాం[ అతి తక్కువ ఖరీదు తో స్టంట్ తయారు చేసిన  వ్యక్తి]   , ఎల్లాప్రగడ సుబ్బారావు ,[ఎన్నో  రోగాలను౦డి రక్షించే టెట్రాసైక్లిన్ , ఫోలిక్ ఆసిడ్ కనీ పెట్టిన వ్యక్తి ]  యలపర్తి నాయుడమ్మ[ లెదర్ టెక్నాలజీ లొ ఎన్నోమార్పిడిలు తెచ్చిన  వ్యక్తి  ]  లాంటి వాళ్ళను  ఆదర్శంగా తీసుకుని  ,  నాడు చదువుతున్న వారు , కొందరైనా  సాంకేతికంగా ఆలోచించే మేథావులు సామాన్యుల కోసం  శ్రమ జీవులకోసం   ఇలాంటి ఆవిష్కరణలు చేయాలనీ ఆశిద్దాం .ఈ వ్యాసాన్ని  చదివిన  కొందరైనా  స్పందిస్తారని ఆశిద్దాం .  
కామెంట్‌లు