*అంతటా... అన్నియూ... తానెయై ఉన్నాడు... !*-- కోరాడ నరసింహా రావు
దుష్ట శిక్షణ కొరకు... 
  శిష్ట రక్షణ కొరకు... 
    అవతారములు దాల్చు 
    ఆది విష్ణవే అతడు !

 సంశయమ్మే లేని... 
   నిశ్చల భక్తి తత్పరుడు... 
    కారణ జన్ముడు... 
  .  ప్రహ్లాదుఁడితఁడు !

శాపవశమున... 
  దనుజనిగ బుట్టిన 
    హరి ద్వారపాలకుండా 
      హిరణ్యకశిపుండు !

 సృష్టిలో... నారాయణుడు 
  లేని చోటే లేదని...నిరూపించి
   స్తంభమునుండి ద్విరూపుడై 
    నారసింహునిగానిలిచినాడు

లేడు, లేడనువారి... 
   వాదములూ   బలపరచి... 
     వి జ్ఞాన స్వరూపమై... 
       ప్రభవించు చున్నాడు !  

 ఎవరే రీతి తలచిన... 
  ఆ తీరుగా మారి... 
    అంతటా... అన్నియూ... 
     తానెయై ఉన్నాడు !
      *******

కామెంట్‌లు