బాలలు ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బాలలండి బాలలు
అందాల బాలలు
దివి నుండి భువికొచ్చిన
వినువీధి తారలు!

బాలలను చూడగానె 
చేయడెపుడు ముద్దు!
ఆటఆడి పాటపాడి 
కలిసిపోండి ప్రతి పొద్దు!

బాలలను ఎప్పుడైన 
ఏడిపించ వద్దు!
వారేగా భూమిమీది
దేవుళ్ళనుట కద్దు!!
****************

కామెంట్‌లు