* కోరాడ మినీలు *

  * అనంతంగా సాగిపోతూ.. *
.       *******
 పాంచభౌతిక ఫౌంటెన్..... 
 ఏకమనేకంగా ప్రభవిస్తూ... 
.అనేకమేకమయేలోపు ...
  మధ్యలో,సప్తవర్ణాల
    సొగసులతో... నవరసాల   నాట్యాలు !!
   అంతులేని ప్రదర్శనలతో.... 
 అనంతంగా సాగిపోతూ... !
.    ********
   @ ఏకైక వీక్షకుడు... ! @
        @@@@@@@
       ప్రపంచ రంగస్థలం పై .....
అందరూ పాత్రధారులే.. !
 సూత్రదారి, ఏకైక వీక్షకుడు  
ఆ సర్వేశ్వరుడొక్కడే... !
ఒక్కో నాటకంలో ఎన్నెన్ని సన్నివేశాలు...
 ఎన్నెన్ని సంఘటనలు !! 
ఒకే సంస్థలో... అనేక  వ్యవస్థల్లా..... !!!
      ******
        * నిజ స్పృహలో *
.         *****
  కళ్ళముందు జరుగుతున్నదంతా...నిజం కాదని,
 నటనలేననే సత్యాన్ని గ్రహించాడు !
  మబ్బులువీడిన రవిబింబంలా  
నిజ స్పృహలో... 
   ప్రేక్షకుడై వీక్షించటం మొదలు పెట్టాడు !!
       *******
కామెంట్‌లు