నక్షత్రం!!;- ప్రతాప్ కౌటిళ్యా
నక్షత్రాలు మనుషుల్లా పోల్చుకుంటున్నాయి
మనుషుల్లా మాట్లాడుకుంటున్నాయి!!

లోయలోకి జారిపడ్డ నక్షత్రం
రేపటి నక్షత్రం కోసం వేచి చూస్తుంది!!

రెక్కలొచ్చిన చీకటి
ఎగిరి ఎగిరి ఆగిపోయింది!!

చూపులు లేని చీకటి రాత్రంతా 
కాకి తో పాటు కాలక్షేపం చేస్తూ
ఉదయం గుడ్లగూబతో
గుసగుసలాడుతుంది!!?

ఎవరెవరు గుర్తుపడతారో నని
గూట్లో నీ పిట్ట పిల్లలు పట్టపగలే
చట్టపట్టలేసుకొని తిరుగుతున్నవి!!?

కాంతికి తోకలు మొలిచి
మనిషి తో పాటు నడవడం
నేర్చుకుంటుంది!!??

మేఘాలు ఎండిపోయి 
చందమామలా మారి గాల్లో
గందరగోళం సృష్టిస్తున్నాయి!!

ఎగిరే గ్రహాల రెక్కల కోసం
త్రొక్కిసలాట జరుగుతుంది!

ఆగిపోయిన గాలి మళ్లీ
మనుషుల్లో కలుస్తుంది!!

నేరేడు పళ్ళు దొండపండ్ల కన్నా మిరప పండ్లు కావాలని నాలుక
మాటల కోసం కాదు రుచికోసమే పుట్టినట్లు
ధ్రువీకరణ పత్రం జారీ చేసింది!!?

వెంట పడవద్దని వెలుగు
ఆడపిల్లలా సిగ్గుపడుతుంది!!

వేట కొడవళ్ళు ఆటలు ఆడడం మానేసి
పూల తోటల కాపలా కాస్తున్నాయి!!

మట్టిలోని పుట్టలు తవ్వినప్పుడు
బయట పడ్డది పాములు కాదు
చీమలు రాసిన చరిత్ర లు!!?

రంగులు ఎందుకని కళ్ళు నిరాహార దీక్ష
చేస్తుంటే
ముఖాలు ఎలా గుర్తుపడతారని కాంతి
ముఖం చాటేసింది!!?

తినటానికి తీపి ఉంది కానీ అందం లేదని
అరుదైంది కారం అని లేకుంటే అంద వికారమైంది ఆహారమని
అందాన్ని బంధించి తెమ్మని మెదడు పదే
పదే పద్యం రాస్తుంది!!?

చీకట్లోనే విశ్వమంతా సృష్టించబడుతుంది
చీకట్లోనే మెరిసే నక్షత్రాలు
ఆత్మహత్య చేసుకుంటున్నాయి!!

విశ్వం ఇప్పుడు నక్షత్రాలకు
రెక్కలు ఇచ్చి ఎగిరిపోమంది
చచ్చిపోవడానికి కాదు!!?

ఎర్రగా పారుతున్నది రక్తం కాదు కాంతి
చీకటినంత తినేసి అందం కనుగొనేందుకు
ఎదురుచూస్తుంది!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist
8309529273

కామెంట్‌లు