కవి తొంగి చూస్తున్నాడు !(బాలగేయం :- ) కోరాడ నరసింహా రావు.
వాడు కిరణ్ గాడి ఫ్రెండు... 
   ఆ తన్వీర్  గొప్ప దండు !
 తొందరగాఉదయంలేవడు 
 వాడెపుడూటైముకుతెమలడు 

వాడికి స్టైలు ఎక్కువ... 
 కొత్త బట్టలంటేనే మక్కువ !
 పక్కనే స్కూలు ఉన్నా... 
 వెళ్ళడు  సైకిలు లేకున్న !!

ఇంగ్లీషు రైములను వాడు 
 చిలుకలా  పలుకుతాడు 
 అక్షరాలు -  అంకెలను... 
 తిరగేసి  రాస్తుంటాడు !

వెటకారంగా  మాటకు మాట 
 దీటుగ  బదులిస్తాడు !
 సునాయాసంగా  ప్రాస... 
 అలవోకగా  పలికేస్తాడు !!

ఇది ఎన్ని జన్మల  సాధనో... 
 ఎంత గొప్ప అదృష్టమో... 
 ఆ బాల మేధావిలో... 
 కవి  తొంగి చూస్తున్నాడు !
.    ******

కామెంట్‌లు