చదువు! అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాసులో పిల్లలు అంతా చెవులు కొరుక్కుంటున్నారు.దాని కో కారణం ఉంది. ఆసాయంత్రం చెట్టు కింద కూచోబెట్టి టీచర్ వారిని "మీఇష్టం వచ్చిన టాపిక్ మీద మాట్లాడండి " అని  అడుగుతారు. కొందరు కథలు కొందరు తమకు నచ్చిన పుస్తకం సినిమా తమకు  ఏసబ్జెక్ట్ ఇష్టమో చెప్తారు.జయ అంది"నేను మాఅమ్మమ్మ ని గూర్చి  చెప్తాను ".
లాస్ట్ పీరియడ్!బిలబిలా పిల్లలంతా చెట్టు కింద చేరారు.ముందు జయ ప్రారంభించింది "నేను ఇప్పుడు మాఅమ్మమ్మ నిగూర్చి చెప్తాను.యాభై దాటిన వయసులో మాఅమ్మమ్మ నాదగ్గర స్మార్ట్ ఫోన్ లో తెలుగు టైప్ చేయడం నేర్చుకుంటోంది.ఆన్లైన్ పేపరు కి చిన్న చిన్న కవితలు  కథలు టైప్ చేసి పంపాలని ఆమె కోరిక!స్మార్ట్ ఫోన్ ని ఓగంట మాత్రమే  ఉపయోగిస్తోంది.ఆపై నాకు ఇవ్వకుండా  దాచేస్తోంది.కొత్త రకం కుట్లు అల్లికలు పాటలు నేర్చుకుని నాకు నేర్పుతోంది." చప్పట్లతో ఆప్రాంతం దద్దరిల్లింది.టీచర్ వెంటనే  ఇలా అన్నారు "శభాష్ జయా!ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే  మనం రోజూ ఏదోఒకటి నేర్చుకుంటూ ఇతరులకు నేర్పాలి. వయసుతో పనిలేదు. స్వామీ రామతీర్ధ  జపాన్ లో పర్యటిస్తున్నారు. ఓడలో ఓ90ఏళ్ళ జపాన్ కి చెందిన ఓ పండు ముసలితాత అతికష్టం మీద చైనా అక్షరాలు చదవటం చూశాడు.అవి రాసే ప్రయత్నంలో ఉన్న  ఆయనతో" ఇంతవయసులో చేతులు వణుకుతూ  కళ్ళు సరిగ్గా కనిపించకున్నా చైనా భాషను ఎందుకు నేర్చుకుంటున్నారు?" అని ప్రశ్నించాడు. దాని కి ఆతాతగారు ఏమన్నారంటే " నేను బతికున్నంతకాలం ఏదోఒకటి నేర్చుకుంటూనే ఉంటాను.లేకుంటే నేను బతకడం శుద్ధ దండగ! నాబొందిలో ప్రాణం ఉన్నంతకాలం ఏదో ఒకటి చేసి సాధించి తీరాలి అనేది నాఆశయం! ఎంత గొప్పమాట! "అవును టీచర్  అంటూ పిల్లలు అంతాముక్త కంఠంతో అరిచారు.🌹
కామెంట్‌లు