అలరించిన హిందీ దివాస్
  మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయిలాపూర్ లో జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపన్యాసాలు పాటలు, కవితలు నృత్యాలతో అలరించారు. హిందీ భాష గొప్పతనాన్ని  చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ,మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సంజీవ్,  ఉపాధ్యాయులు సురేందర్, వెంకట్రాంరెడ్డి, సత్యనారాయణ సౌజన్య ,చంద్రకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.
కామెంట్‌లు