సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
  క్రియాత్మక... నిష్క్రియాత్మక
     ****
క్రియ అంటే మాములుగా పని అంటాం. క్రియ అంటే చర్య, స్థితి లేదా సంఘటనను వివరించడానికి ఉపయోగించే పదాన్ని క్రియ అంటాం. కర్త వల్ల క్రియలు జరుగుతుంటాయి. 
 మనం ఏ పని  చేసినా చేయకపోయినా మన దేహంలోని అంతర్గత అవయవాలన్నీ క్రియాత్మకంగా పని చేస్తూనే ఉంటాయి.
వాటి వల్లే మనం జీవిక సాగిస్తున్నాం.
వ్యక్తులుగా క్రియాత్మక వైఖరితో ఉంటేనే  శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలం. 
క్రియాత్మకమైన వైఖరి చైతన్యవంతమైన స్థితి. మనలోని అంతర్గత సామర్థ్యాలను వెలికి తీయగలదు.అనుకున్నది సాధించేందుకు సోపానం కాగలదు.
నిష్క్రియాత్మకత  స్తబ్దతకు ,జడత్వానికి ప్రతీక.క్రియాశీలకమైన, క్రియాత్మకమైన ప్రతిస్పందన లేక పోవడమే నిష్క్రియాత్మకత.
ఏమి జరుగుతున్నా  పట్టనట్టు వ్యవహరించడం, ఇతరులు ఏది చెప్పినా ఉచితానుచితాలు, పర్యవసానాలు ఆలోచించకుండా అంగీకరించడం నిష్క్రియాత్మక వైఖరికి చిహ్నం.
 ఇలాంటి వైఖరి ఉన్న వారు త్వరగా మోసపోవడమో, జీవితంలో కోలుకోలేని దెబ్బ తినడమో జరుగుతుంది.
కాబట్టి మనశ్శరీరాలను క్రియాత్మకంగా ఉంచుకుని, నిత్య జీవితంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు