పసి విషాదం ;-ఎం. వి. ఉమాదేవి. బాసర.
ఆట వెలదులు 

దీన వదనుడయ్యు దిక్కులే నితనము 
చేయి జాపుచుండె చిన్నవాడె 
యాకలంటు జనుల యర్ధింప బలుకరే 
వీధిలోననెంత విభ్రమమ్ము !

కోట్ల సంపదలను కూడగట్టిననేమి 
కూడులేని జనుల కొరకునిడక 
పొడుచుకొచ్చినట్టి పోరని శల్యముల్ 
ప్రశ్న వేయుచుండె ప్రజలనెపుడు !!


కామెంట్‌లు