అన్నం ఎలా ఉంటేనేం?;-- జగదీశ్ యామిజాల
 జవాహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య సమరంలో ఓమారు జైలుపాలయ్యారు.
అప్పుడు అన్నంలో రాళ్ళు ఎక్కువగా ఉన్నాయని, తినలేకపోతున్నామని జైలు వార్డన్ తో అన్నారు.
అయితే జైలు వార్డన్ నెహ్రూని అవహేళన చెశారు. 
"స్వాతంత్ర్య సమర ఖైదీలుగా మీరందరూ బంధింపబడ్డారు. మీకు అన్నంలో రాళ్ళుండటం పెద్ద విషయమా? ఈ దేశాన్ని ప్రేమించేగా మీరిక్కడికి వచ్చారనుకుంటాను" అన్నాడు జైలు వార్డన్.
వార్డన్ చెప్పినదంతా విన్న నెహ్రూ "మేము మా దేశాన్ని ప్రేమిస్తున్నాం. అది నిజం. అందుకేగా ఆ మట్టిని తినడం మాకు ఇష్టం లేదు" అనడంతో జైలు వార్డన్ కిమ్మనలేదు.
స్వాతంత్ర్యోద్యమంలో నెహ్రు మొత్తంమీద 3259 రోజులు జైల్లో గడిపారు. మొదటిసారి అరెస్టయినప్పుడు ఆయన 88 రోజులు (1921 డిసెంబర్ 6వ తేదీ నుంచి 1922 మార్చి 3 వ తేదీ వరకు) లక్నో డిస్ట్రిక్ట్ జైల్లో శిక్ష  అనుభవించారు. తొమ్మిదవ సారి అరెస్టయినప్పుడు అత్యధికంగా 1041 రోజులు జైలులో ఉన్నారు. 1942 ఆగస్టు 9వ తేదీ నుంచి 1945 మార్చి 28 వరకు.


కామెంట్‌లు