పుట్టిన రోజు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
అలంకరణలు అధిరాయి
 బెలూన్లు ఊగాయి
 బ్యానర్లు మెరిసాయి
 సంతోషాలు కురిసాయి

పుట్టినరోజు వచ్చింది
 ఆడంబరాలు పూసింది
మెప్పులెన్నో రాల్చింది
చప్పట్ల వాన కురిసింది

  మిక్కీ మిన్నీ మౌస్ లు
 బార్బీ గర్ల్, యూన్ని కార్నులు
 సూపర్ మాన్, శక్తిమాన్ 
చోటా భీమ్ బొమ్మలు.

కామెంట్‌లు