నేను;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
బొమ్మనుచూచా
భ్రమలోపడ్డా
ఆలోచనలతో
సతమతమయ్యా!

కొమ్మనుచూచా
గమ్మయిపోయా
అందాలనుచూచా
ఆనందంలోమునిగిపోయా

రెమ్మనుచూచా
చిత్తయిపోయా
కోరికలతో
కుస్తీచేశా

లేమను చూచా
లెస్సనుకున్నా
మనసునువిప్పా
ముచ్చటపడ్డా

వామనుచూచా
వశమయిపోయా
వలపుసంకెళ్ళలో
బంధీనయిపోయా

శ్యామనుచూచా
సంతసపడ్డా
సరససల్లాపాలతో
సమయంగడిపా

హేమనుచూచా
హాయనిపలకరించా
మాటలుకలిపా
చెలిమినిచేశా

భామనుచూచా
భ్రాంతిలోపడ్డా
లేనిది ఉన్నట్లుతలచా
భావకవితలను వ్రాశా


కామెంట్‌లు