నేస్తాలుఅవ్వండి (బాలగేయం ) కోరాడ నరసింహా రావు !
ఇంజనీర్ల మౌతామని... 
  డాక్టర్ల మౌతామని... 
    కలెక్టర్ల మౌతామని... 
     మినిస్టర్ల మౌతామని... 
     మీరంతా అంటుంటే.., ఇక  రైతులెవరు ఔతారు పిల్లలూ!
    ఎవరు పంటలు పండిస్తారు పిల్లలూ... !!
 మనకు ఆ హారమెలా వస్తుందీ పిల్లలూ... !?
     మనమెలా బ్రతకగల మింక
పిల్లలూ... ?!
                "ఇంజనీర్ల మౌతా..."
ఆహారమె ఆరోగ్యం... 
 ఆహారమె ఆనందం... 
  మంచి ఆహారము తింటేనే 
 బలము - తెలివి తేటలు !

ఆహారములేనిదే... 
  పనులేవీ చేయలేము... !
   బుద్ది పనిచేయదు... 
    అభివృద్ధి ఉండదు... !!

 కష్ట,నష్టాలకుఓర్చిరైతు,ఆహార ధాన్యాలు,పండ్లు,కూరగాయలను  పండించి ఇస్తుంటే....., 
  గిట్టుబాటులేక రైతు కష్టాలను 
పడుతున్నడు... !
  మీరెంతగొప్పవారైనా  పిల్లలూ 
ఆహారములేనిదే బ్రతకలేము తెలుసుకోండి.... !
  రైతులను ఆదుకోండి...మీరూ 
వ్యవసాయస్తులు కండి...మీరు 
 రైతులు కాలేకున్నా... రైతు నే స్తాలు  అవ్వండి ... !!
      *******

కామెంట్‌లు