అవును ..!!-----డా.కె.ఎల్.వి.ప్రసాద్.--హన్మకొండ .
'గుడిసెలు 
కాలిపోతున్నాయ్!'
అయ్యో ....
ఫైరింజన్ పిలవకండి 
అది పుస్తకం పేరు!
బోయి భీమన్నగారి
కలం నుండి వెలువడిన 
కమ్మని కవితా సంపుటి !!

                 ***
' పొలీసులు -
  అరెస్ట్ చేస్తే ..!'
మిమ్మల్నికాదు 
భయపడకండి !
ప్రజాచైతన్యం తో
విషయం-
పదిమందికీచేరాలని
ప్రజాసేవకులు
బొజ్జా తారకం గారి
పదునైన రచన....!
పోలీసులకు,
చెమటలుపుట్టించిన 
అక్షర తూణీరం ..!!
           ***
' హగ్.మి.క్విక్'
బాబోయ్ ....
నన్ను కాదు సుమండీ!
అది నేను రాసిన-
కథల పుస్తకమండీ,
వీలైతే మరి-
చదివి చూడండి......!!

            ***

కామెంట్‌లు