మా వందనముల నందు కొనుమోయి ;-- కోరాడ నరసింహా రావు
ఓ  గురజాడ మహాశయా... !
 పాండిత్యాన్ని ప్రదర్శించి... 
 గొప్పకవిననిపించుకుని... 
 సన్మానాలు  -  సత్కారాలూ 
 పొందాలని తలచలేదు !

సమాజ రుగ్మతలకు... 
 చలించెను  నీ హృదయం !
  రగిలిన ఆవేదనతో ... 
 కడిగేసింది నీ కలం !!

ఆశ్రయదాతల మెప్పుకోసం 
 లేని గొప్పలతో పాటు... 
 స్త్రీ సౌందర్యఅతిశయోక్తులతో 
 పబ్బం గడుపుకుంటూ... కొంద రికే పరిమితమైన కవిత్వాన్ని... 
 అందరికోసం, అందరికీ ... 
 చేరువ చేసే దారులు వేసిన 
 నవసాహితి నిర్మాతవు నీవు 
 భావితర సాహితీపరులను 
.నీవారసులను జేసికొన్న... 
 ఘనత నీదేనోయీ .... !
 మావందనములను... 
    అందుకోనుమోయి💐
   🙏🌷🙏🌷🙏 

కామెంట్‌లు