అతి! అచ్యుతుని రాజ్యశ్రీ


ఏదైనా మితం హితంగా ఉండాలి. అతి సర్వత్ర వర్జియేత్ అన్నారు. అడుగో గోపి .వాళ్ళబామ్మ ఏంటో అరుస్తోంది " అలాజంక్ ఫుడ్ తినకురా నాయనా! పాలు తాగు.పళ్ళు తిను.మీఅమ్మ నాన్న ఆఫీసులో నించి బైట పడేప్పటికి ఓగంట పడుతుంది. హోం వర్క్ పూర్తి చేసుకో.ఆడుకోహాయిగా".గోపీకి ఆమె మాటలు చెవికెక్కటంలేదు.మాగీ ఇంకా చిప్స్ఓ50రూపాయలు తగలేసి తెచ్చాడని బామ్మ సణుగుతోంది.వాడికి ఇదేమీ పట్టలేదు. టి.వి.చూస్తూ నెమ్మదిగా నాలుగు పొట్లాలు గుటకాయస్వాహా చేశాడు. వాడు బరువు పెరిగాడు.రొప్పుతూ టి.వి.కి కళ్ళు అప్పగించాడు.ఆరాత్రి పడకగదిలో బామ్మ వాడికో కథ చెప్పసాగింది."గోపీ! ఆచిట్టి చిలకపిల్ల రోజూ రెండు మైళ్ళు ఎగురుతూ ఓతోటలో వాలేది.దాని అమ్మా నాన్న ఎన్నో సార్లు హెచ్చరించారు "నీవు నదిపై ఎగురుతూ వెళ్లాలి.మధ్యలో ఆగే వీలులేదు.రెక్కలు అలిసితే కష్టం!మాదగ్గరకి రాలేవు".ఐనా చిలకపిల్ల వినలేదు "అబ్బో! ఆతోటలో రకరకాల పళ్ళు!హాయిగా కష్టపడకుండా తేరగా తిండి దొరుకుతుంది. సిరిరా మోకాలొడ్డటం అంటే ఇదే! కావాలంటే మీరు కూడా రండి.అంతాఅక్కడే ఆచెట్లపైనే ఉండొచ్చు "."వయసు మీద పడింది. అంతదూరం ఎగరలేము"అన్నాయి.చిట్టిపొట్టి చిలుక ఆరోజు పొద్దుటే ఎగిరిపోయింది ఆతోటలోకి! ఆబగా పొట్టనిండా మెక్కుతూ  కాసేపు నిద్ర పోయింది. ఇంతలో పాము బుస్ బుస్ వినపడటం తో  భయం ఖంగారు లో త్వరగా  ఎగరలేక పోయింది. పాము  చురుగ్గా కదులుతూ  దాన్ని అమాంతం మింగేసింది.అందుకే పెద్దలమాట చద్దిమూట అన్నారు. బరువు పెరగడం వల్లనే చిలుక చురుగ్గా కదలలేకపోయింది." బామ్మ మాటలు వింటూ వాడూ ఆలోచనలో పడ్డాడు. బడిలో వాడిని డుంబూ బొండాం అని పిలుస్తున్నారు. రన్నింగ్ రేస్ లో రొప్పుకుంటూ పరుగెడుతుంటే"హాయ్ హాయ్!రుబ్బురోల్!రన్ రన్!అని పిల్లలు అల్లరిగా అరుస్తూ ఉంటే  అమ్మాయిలంతా కిసుక్కున నవ్వటం గుర్తు కొచ్చింది.రేపటి నుంచి జంక్ ఫుడ్ తినగూడదని నిశ్చయించుకున్నాడు 🌹

కామెంట్‌లు