మట్టిలో మాణిక్యం!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపిల్లాడు కటిక పేదరికంలో పుట్టి పెరిగాడు. చిన్న చితక పనులు చేస్తూ రాత్రి కట్టెల వెలుగులో తను ఇతరులను అడిగి తెచ్చుకున్న పుస్తకాలు చదివేవాడు.మాష్టారిని అడిగి  జార్జి వాషింగ్టన్ జీవిత చరిత్ర తెచ్చుకుని అలాచదువుతూ నిద్రలోకి  ఒరిగాడు.మాష్టారు అస్సలు పుస్తకం ఇవ్వడానికి ముందు ఒప్పుకోలేదు. "ఏమాత్రం పుస్తకం నలిగినా ఊరుకోను.చాలా జాగ్రత్తగా తెచ్చి ఇవ్వు"అని ఎన్నో షరతులు ఆంక్షలతో ఇచ్చారు.పాపం ఆకుర్రాడు చదువుతూ అలా కిటికీలో పెట్టి కునుకు తీశాడు. అనుకోకుండా  డబడబా వర్షం కురిసి పుస్తకం తడిసి ముద్దయింది.పైగా  మురికి మట్టి అంటుకుంది.ఆపిల్లాడు భయం తో వణికిపోయాడు.చేతనైనంత వరకు శుభ్రపరిచాడు.మాష్టారి దగ్గరకి భయం భయంగా వెళ్లి జరిగింది పూసగుచ్చినట్టు తు.చ.తప్పకుండా చెప్పాడు. మాష్టారి కోపం నషాళానికి అంటింది.ఆయన కోపంతో రంకెలేస్తూ "నాతోటంతా శుభ్రం చేయాలి రోజూ!చెట్లపాదుల సంరక్షణ చేయాలి. "పాపం! ఆపిల్లాడు  కిక్కురుమనలేదు.అలాగే రోజంతా నడ్డివిరుచుకుని మూడు రోజులలో తోటకి కొత్త కళని తెచ్చాడు.మాష్టారికి ఆపిల్లాడి పై జాలేసింది. " అరె బాబూ! అడవి తుప్పలా ఉన్న నాతోటని నందనవనం లా మార్చావు.ఈపుస్తకంని నీకు బహుమతిగా ఇస్తున్నాను.నీవు గొప్పవాడివి అవుతావు" అని ఆశీర్వదించాడు.ఆబీద బాలుడే అబ్రహం లింకన్🌹
కామెంట్‌లు