బంధుబలగం!అచ్యుతుని రాజ్యశ్రీ

 అడగందే అమ్మ ఐనా పెట్టదు అంటుంది ఆమ్మ!
నరుని నాలుకకు నరంలేదు అంటాడు నాన్న!
అడుసుతొక్కనేల కాలుకడుగనేల అంటాడు అన్న!
అర్ధంలేని చదువు వ్యర్థం అంటుంది అక్క!
తను తీసిన గోతిలో తానే పడతాడు అంటాడు  తమ్ముడు!
చిత్తం శివుని మీద భక్తి చెప్పులమీద అంటుంది చెల్లి!
తిండికి  తిమ్మరాజు పనికి పోతరాజు అంటాడు తాత!
నోరు మంచిదైతే ఊరుమంచిదౌతుంది అంటుంది నాన్నమ్మ!
ఆలూలేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం అంటుంది ఆమ్మమ్మ!
ఆస్తి మూరెడు ఆశబారెడు అంటుంది ఆమ్మ!
ప్రేమతో పెట్టింది పిడికెడైనా చాలు  అంటాడు పెద్ద నాన్న!
పెదవి దాటితే పృధ్వి దాటుతుంది అంటుంది పిన్ని!
అతివినయం ధూర్తలక్షణం అంటుంది అత్త!
బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు అంటాడు బావ!
బతుకు తక్కువ బడాయి ఎక్కువ అంటాడు బాబాయి!
మొక్కై వంగనిది మానై వంగునా అంటాడు మామ!
అందరి మాటలు మంచి ముత్యాలు!
బంధువులసామెతలు తేనె ఊటలు🌹
కామెంట్‌లు