ఆదర్శమై నిలువగలదు @కోరాడ నరసింహారావు !
కన్నతండ్రే ఓగొప్పపాఠ్యగ్రంధం!
తండ్రిని చదివే,బిడ్డ తండ్రంతటి
వాడు అయేది... !
తనలోని తండ్రిజీన్స్... ఆతండ్రి ప్రవర్తనను పరిశీలిస్తూప్రభావిత మౌతుంటాయి !
తండ్రి ప్రతిరూపమే బిడ్డ !
 అందుకే... ఓ తండ్రీ... !
 పరిసరాలు - పరిస్థితులఅవగా హనతో...బుద్దిని వినియోగించి 
 విచక్షణను ప్రదర్శించి... 
 వివేకంతో మంచి-చెడులవిశ్లేష 
ణ గావించుకుని...మహాత్ముల ఉపదేశాలను వంటబట్టించుకు ని...మొదట నిన్నునువ్వు ఉత్త మవ్యక్తిత్వం గలమనిషిగాతీర్చి దిద్దుకో.... !

నీజీవితమే నీబిడ్డకు ఓ భగవత్ గీత కాగలదు !
అతడిజీవితమూ,అతనిబిడ్డకు
ఒక ఉత్కృష్ట పాఠ్య గ్రంధమై... 
భావిసమాజం మహోన్నతంగా  ప్రపంచానికి ఆదర్శమై నిలువ గలదు... !
     *******

కామెంట్‌లు